


కళా సాంస్కృతిక రంగాలలొ ఆంధ్ర చరిత్రలొ గణనీయమైన స్థానం గలది మన గుంటూరు జిల్లా.
విద్య, వ్యాపార, రాజకీయ రంగాలలొ మన గుంటూరు జిల్లాకి దేశంలొనే ఒక విశిష్ట స్థానం వుంధి. ప్రగతిమార్గంలో దూసుకుపోతూ అనేక రంగాలలో అభ్యున్నతి సాదిస్తూ అన్ని కోణాలలో ఆధునికతను ప్రతిఫలించే రూపురేఖలను గుంటూరు జిల్లా మరియు నగరాలు సంథరించుకుంటున్నాయి.
కళలకు కాణాచి అయిన మన జిల్లా సాంస్కృతిక ప్రత్యేకతను చాటిచూపే అమరావతి ఉత్సవం, కాలచక్ర మహోత్సవం వంటి విశిష్ట కార్యక్రమాలు నిర్వహించి గతంలో ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించాము.
ఆయా సంధర్భాలలో కళా, సాంస్కృతిక రంగాలలో కృషి చేస్తున్న మన జిల్లాకు చెందిన విశిష్ఠ వ్యక్తుల మనసులలో కలిగిన ఆలోచనలకు రూపం ఇస్తూ గుంటూరు నగరంలో కళాకారుల కళాభినివేశ వ్యక్తీకరణకు అనువుగా ఒక కేంద్రం - ఆర్ట్ సెంటర్ ఆఫ్ గుంటూరు - ను స్థాపించాలనే ప్రణాలిక సిద్ధమయింది.
గుంటూరు జిల్ల పరిపాలనా యంత్రాంగం ఈ ప్రణాళికకు సానుకూలంగ స్పందించి జిల్లా కలెక్టరు కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఆఫీసర్స్ క్లబ్బు ఆవరణలో 1000 గజాల స్థలాన్ని ఈ సెంటరు నిర్మాణానికి కేటాయించగా, 2007, జూన్ 16న భూమిపూజ నిర్వహించి ఈ ప్రణాళికను ఆరంభించదం జరిగింది.
ఒక గట్టి పునాదితో, గుంతూరు జిల్లా వాసులే గాక, సకలాంధ్ర ప్రజానీకం గర్వించ గలిగే ఒక కళా, సాంస్కృతిక విశేషంగా దీనిని రూపు దిద్దలనే తపన వలన కొంత కాలహరణ జరిగినా, ఇప్పుదు ఒక స్పష్టమయిన నిర్దిష్టమయిన కార్యాచరణ కలిగిన ప్రణాళికతో - ఆర్ట్ సెంటర్ ఆఫ్ గుంటూరు - మీ ముందుకు వస్తున్నది.
రానున్న తరాలు ఎంతో గర్వించగలిగే ఈ ప్రణాళికలో మీ భాగస్వమ్యం కోరే సౌభాగ్యం లభించడం మా సుకృతంగా భావిస్తూ, ఈ విశిష్ఠ కార్యక్రమంలో ఆంధ్రులందరమూ పాలుపంచుకుందాము. మన తెలుగు కళా, సాంస్కృతిక విలువలను పరిరక్షించుకుందాము.
No comments:
Post a Comment